2019లో విడుదలైన మలయాళ చిత్రం జల్లి కట్టు. లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించాడు. తెలుగులోనూ డబ్ అయిన ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. కేవలం 3 కోట్లతో తెరకెక్కిస్తే,.. 25 కోట్లు సంపాదించింది. విమర్శకులు సైతం ఈ చిత్రానికి పట్టం కట్టారు. ఇప్పుడు ఆస్కార్‌కి అర్హత సాధించింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో 93వ అకాడమీ అవార్డ్స్ లో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న చిత్రంగా 'జల్లికట్టు' నిలిచింది.
మొత్తం ఆస్కార్స్ బరిలో హిందీ, మలయాళం, ఒరియా, మరాఠి భాషల నుంచి 27 సినిమాలు నిలిచాయి. మనుషులు, జంతువుల మధ్య బావోద్వేగ పూరిత సన్నివేశాలను కండ్లకు కట్టినట్టు చూపించిన జల్లికట్టు భారతదేశం గర్వించదగ్గ చిత్రాల్లో ఒకటి. ఈ కారణంగా భారత్ నుంచి జల్లికట్టును జ్యూరీ నామినేట్ చేసిందని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు ఛైర్మన్ రాహుల్ రవైల్ తెలిపారు.