ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోందట. ఈ విషయమై కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వచ్చిపడుతున్న విషయం విదితమే. ఇంతకీ, ఈ గాసిప్స్‌లో నిజమెంత.? అంటే, ప్రస్తుతానికైతే నిధి అగర్వాల్‌తో ఈ విషయమై ఎవరూ సంప్రదింపులు జరపలేదట. కానీ, పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ వస్తే వదులుకోనని అంటోంది నిధి అగర్వాల్.
ఎవరు మాత్రం, పవన్‌తో ఛాన్స్‌ని వదులుకుంటారు.? 'పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ రావడమంటే, లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌గానే భావిస్తాను..' అంటోందట ఈ ఇస్మార్ట్ బ్యూటీ. ప్రస్తుతానికైతే నిధి అగర్వాల్ తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తోంది. తమిళంలో మాత్రం నాలుగైదు సినిమాలున్నాయి ఈ బ్యూటీకి. సౌత్‌లో సినిమాల కారణంగా బాలీవుడ్‌కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది.
బాలీవుడ్ నుంచే తాను వచ్చినా, సౌత్ సినీ అభిమానుల అభిమానానికి ఫిదా అయిపోయానంటోన్న ఈ ఇస్మార్ట్ బ్యూటీ, ఇక్కడి సినిమాల నిర్మాణం చాలా వేగంగా వుంటుందని అభిప్రాయపడింది. 'కరోనా లాక్‌డౌన్ లేకపోయి వుంటే, ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ బిజీగా వుండేదాన్ని. కొన్ని కొన్ని సార్లు మనం ఊహించని విధంగా పరిస్థితులు మారిపోతాయ్.. వాటిని మనం స్వీకరించాల్సిందే..' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూసిన నిధి, 'ఇస్మార్ట్ శంకర్'తో సెన్సేషనల్ హిట్ కొట్టిన విషయం విదితమే.