Mahesh, Pawan: మ‌హేష్ రికార్డుని బ్రేక్ చేసిన ప‌వ‌న్‌

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇద్ద‌రికీ రికార్డులు సాధించ‌డం తెలుసు. పాత రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మూ తెలుసు. బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త చ‌రిత్ర సృష్టించ‌గ‌ల స్టామినా వీళ్ల సొంతం.

 

ఒక‌రి రికార్డుని మ‌రొక‌రు చాలాసార్లు బ్రేక్ చేసుకొన్నారు. ఈసారి మ‌హేష్ బాబు రికార్డుని ప‌వ‌న్ దాటేశాడు. మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా `పోకిరి`ని రీ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రం రీ రీలీజ్ రోజున ఏకంగా రూ.1.5 కోట్ల వ‌ర‌కూ రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ రికార్డుని జ‌ల్సా దాటేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజున జ‌ల్సా ని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాని ఏకంగా 440 స్క్రీన్స్‌ల‌లో ప్ర‌ద‌ర్శిస్తే అన్ని చోట్లా హోస్ ఫుల్లే. ప్ర‌పంచ వ్యాప్తంగా రీ రిలీజ్‌లో రూ.3.5 కోట్ల‌ని వ‌సూలు చేసింది జ‌ల్సా. ఓ ఇండియ‌న్ సినిమా, రీ రిలీజ్ లో ఈ స్థాయిలో వ‌సూలు చేయ‌డం ఇది రికార్డ్‌! ఒక్క నైజాంలోనే దాదాపు గా రూ.1.5 కోట్ల‌ని ఆర్జించింది జ‌ల్సా. అదే రోజున త‌మ్ముడు విడుద‌ల చేస్తే దానికీ మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈనెల 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు.

 

ఈ సంద‌ర్భంగా `బిల్లా`ని రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. మ‌రి.. ప్ర‌భాస్ ప‌వ‌న్ రికార్డుని బ‌ద్ద‌లు కొడ‌తాడేమో చూడాలి. అయితే బిల్లా కంటే.. బుజ్జిగాడు విడుద‌ల చేస్తే బాగుంటుంద‌ని కొంత‌మంది ప్ర‌భాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే బిల్లా రీమేక్ సినిమా. ఆ సినిమాలో యాక్ష‌న్ సీన్లు మ‌రీ రొటీన్‌గా ఉంటాయి. బుజ్జిగాడులో ప్ర‌భాస్ మేన‌రిజం, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ అన్నీ కొత్త‌గా ఉంటాయి. ఈ సినిమాని టీవీలో ఎన్నిసార్లు ప్ర‌ద‌ర్శించినా రేటింగులు అదిరిపోతాయి. అందుకే బిల్లా కంటే.. బుజ్జిగాడే బెట‌ర్ అనే వాద‌న వినిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS