ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. దానికి కారణం ఓ హీరోయిన్. మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేని కథానాయికగా ఎంచుకొన్నారు. పూజా ఫామ్ లో ఉంది. పైగా మహేష్ పక్కనజోడీ బాగుంటుంది. వాళ్లది హిట్ పెయిర్. దాంతో పాటు త్రివిక్రమ్ సినిమాలో పూజా నటించిన ప్రతీ సారీ హిట్టు వచ్చింది. ఆ సెంటిమెంట్ తోనే పూజాని ఎంచుకొని ఉండొచ్చు.
కాకపోతే సోషల్ మీడియాలో జనాలు మామూలుగా ఉండరు కదా. దీనిపై ట్రోలింగ్ మొదలెట్టారు. పూజా హెగ్డేని త్రివిక్రమ్ వదలడా అని కొంతమంది, `ముసలోడే కానీ మహానుభావుడు` అంటూ త్రివిక్రమ్ ని ఉద్దేశించి ఇంకొంతమంది ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. త్రివిక్రమ్ కీ, పూజా హెగ్డేకి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని, అందుకే.. త్రివిక్రమ్ అదే హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నాడని ఏవేవో పెడర్థాలు తీస్తున్నారు. ఇందులో నిజం ఎంతో తెలీదు గానీ, త్రివిక్రమ్ ఈ కామెంట్లని అస్సలు పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో పూజానే కథానాయిక. ఆ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అందుకే పూజాని ఎంచుకొన్నాడు త్రివిక్రమ్. ఒకవేళ ఆ రెండు సినిమాలూ ఫ్లాప్ అయినా, పూజాని కంటిన్యూ చేస్తే అప్పుడు ఈ కామెంట్లకు అర్థం ఉండేదేమో..?