జంబ లకిడి పంబ- ఈ టైటిల్ కియా టైటిల్ తో వచ్చిన సినిమాకి తెలుగునాట ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనంతటికి కారణం దర్శకుడు స్వర్గీయ EVV గారు, ఆయన చేసిన ఆ ప్రయోగం చక్కటి హాస్యంతో పాటుగా ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకి అందింది.
ఇక ఇన్ని సంవత్సరాలకి ఇదే టైటిల్ తో కమెడియన్ నుండి హీరోగా మారిన శ్రీనివాస రెడ్డి హీరోగా ఓ చిత్రానికి తెరతీశాడు. అయితే ఇప్పటికే హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న కెరీర్ కి ఇది హ్యాట్రిక్ విజయం అవ్వాలని ఆశించి ఈ చిత్రంలో నటించాడు.
అయితే పాత సినిమా కథకి ఇప్పటి సినిమా కథకి ఏ మాత్రం సంబంధం లేకపోగా అదే టైటిల్ ఇంత ధైర్యంగా పెట్టేసరికి అదే స్థాయిలో హాస్యం ఈ సినిమాలో ఉంటుంది అని ఊహించారు. కాకపోతే సినిమా చూస్తే ఆ సినిమాతో ఏ ఒక్క అంశంలోనూ ఈ సినిమా పోటీకి లేదు అనే చెప్పాలి.
ఈ సినిమాకి రచయిత-దర్శకుడిగా చేసిన మురళీకృష్ణ కథ సిద్ధం చేయడంలో, హాస్య సన్నివేశాలు రాసే ప్రక్రియలో పూర్తిగా విఫలమయ్యాడు అనే చెప్పాలి. ఇదే సమయంలో ఒక హిట్ టైటిల్ వాడుకునే క్రమంలో ఉండే అంచనాలని ఈ సినిమా ఏ ఒక్క డిపార్టుమెంటులో అందుకోలేకపోయింది.
నటీనటులు బాగానే చేసినప్పటికి కథ, కథనంలో బలం లేకపోవడంతో వారి నటన కూడా సినిమాని గట్టేకించలేకపోయింది. హీరోగా వరుసన రెండు హిట్స్ అందుకున్న శ్రీనివాస రెడ్డికి మూడవ ప్రయత్నంలో మాత్రం కాస్త ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.