బిగ్ బాస్ హౌస్ లో లిప్ లాక్

By iQlikMovies - June 23, 2018 - 20:57 PM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపించే పేరు బిగ్ బాస్. ఈ రియాలిటీ షో కి ఆ రేంజ్ లో ఫాలోయింగ్ వచ్చేసింది.

 

ఇకపోతే తెలుగులో వస్తున్నట్టుగానే తమిళంలో కూడా బిగ్ బాస్ షో రెండవ సీజన్ ఈ మధ్యనే ప్రారంభమైంది. ఆ షో లో సైతం మూడు వివాదాలు ఆరు టాస్కులు గా సాగిపోతున్నది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ అయిన జనని, ఐశ్వర్యలు లిప్ లాక్ చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామంతో తోటి పార్టిసిపెంట్స్ తో పాటుగా షో చూస్తున్న ఆడియన్స్ కూడా షాక్ కి గురయ్యారు. అయితే హిందీ లో వచ్చే బిగ్ బాస్ తో పోలిస్తే ఇది చాలా తక్కువే అయినప్పటికి దక్షిణ భారతదేశంలో ఇలాంటివి కాస్త కొత్తవే అని చెప్పాలి.

ఇక్కడ మన తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కూడా పెద్ద పెద్ద గొడవలు మొదలవ్వడం ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండడం అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్నది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS