'జంబ లకిడి పంబ' కామెడీ సరిపోలేదబ్బా.!

మరిన్ని వార్తలు

అప్పుడెప్పుడో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'జంబ లకిడి పంబ' చిత్రం కామెడీ కా బాప్‌ అంటే అతిశయోక్తి కాదు. సినిమా నిండా ఆర్టిస్టులు. ఎవరి దారి వారిదే. నవ్వించడం తప్ప మరో పని లేదు ఆ సినిమాలో. ఆ సినిమా అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవ్వర్‌ గ్రీన్‌ అంతే. ఇప్పుడు కమెడియన్‌ కమ్‌ హీరో శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలో ఇదే టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. 

జె.బి. మురళీ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిద్దీ ఇద్నాని హీరోయిన్‌గా నటిస్తోంది. వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే 'జంబ లకిడి పంబ' అనే టైటిల్‌ పెట్టుకున్నారంటేనే అందరూ విపరీతమైన కామెడీని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అల్టిమేట్‌ అండ్‌ ఇన్ఫినిటీ కామెడీ అప్పట్లోనే ఇవివి తన సినిమా ద్వారా పండించేశారు. ఖచ్చితంగా ఆ టైటిల్‌తో వస్తున్న సినిమా అంటే ఆ స్థాయిలోనే కామెడీని ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ ఈ సినిమాలో ఆ స్థాయి కామెడీ ఉన్నట్లుగా కనిపించడం లేదు. తాజాగా 'జంబ లకిడి పంబ' సినిమా టీజర్‌ విడుదలైంది. 

కామెడీ డోస్‌ సరిపోలేదంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. శ్రీనివాస్‌ రెడ్డి మంచి టైమింగ్‌ ఉన్న కమెడియన్‌. అలాగే వెన్నెల కిషోర్‌ అయినా, పోసాని అయినా. కానీ ఈ టైటిల్‌కి వీరు మాత్రమే పండించే కామెడీ సరిపోదు. అంతకుమించి అనే స్థాయిలో ఉండాలి. అయితే ఇది జస్ట్‌ టీజర్‌ మాత్రమే. గతంలో విడుదలైన మోషన్‌ పోస్టర్స్‌ని ఫన్నీగా డిజైన్‌ చేశారు. 

హీరోగా ఆల్రెడీ రెండు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్‌ రెడ్డి ఈ సినిమాతో ఎంత మేర ఆకట్టుకుంటాడో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS