ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నట సింహం బాలకృష్ణ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీకి కారణం, జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ ఉపయోగించిన వాహనాన్ని వేలం వేసిన తరువాత వచ్చిన రూ 10లక్షల మొత్తాన్ని బాలయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందించారు.
ఈ సందర్బంగా వీరితో పాటుగా జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ కూడా బాలకృష్ణని కలిసిన వారిలో ఉన్నారు. అయితే ఈ భేటికి ఎన్టీఆర్ రాకపోవడానికి కారణలు తెలియరాలేదు.
ఇండస్ట్రీ వర్గాలు మాత్రం, బాలయ్య-ఎన్టీఆర్ కి మధ్య ఉన్న అభిప్రాయభేదాల వలనే ఎన్టీఆర్ రాలేదు అని గుసగుసలాడుకుంటున్నాయి.