వావ్‌ జాన్వీలో చాలా విషయం ఉందే.!

By iQlikMovies - July 03, 2018 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా 'ధడక్‌' చిత్రంతో తెరంగేట్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో భాగంగా జాన్వీ కపూర్‌కి మంచి మార్కులే పడుతున్నాయి. 

అయితే ఆల్రెడీ విడుదలైన వీడియో సాంగ్‌ రివ్యూస్‌ పరిశీలిస్తే, జాన్వీ కన్నా, హీరో ఇషాన్‌కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. డాన్సుల్లో జాన్వీ అంత గ్రేస్‌ చూపించలేదనీ, ఎక్స్‌ప్రెషన్స్‌లో కూడా ఫెయిలైందనీ రిపోర్ట్స్‌ వచ్చాయి. అయితే లేటెస్టుగా ఈ సాంగ్‌ రిహార్సల్‌ వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ వీడియోలో జాన్వీ డాన్స్‌లో బీభత్సమైన గ్రేస్‌ కనిపిస్తోంది. ఈ వీడియో వచ్చాక జాన్వీని అంత తేలిగ్గా అంచనా వేసేందుకు లేదని అర్ధమవుతోంది. 

జాన్వీలో విషయం ఉంది. అయితే తొలి సినిమాలో ఆ యాంగిల్‌ మొత్తం చూపించే అవకాశం రాకపోవచ్చు. మరోటి తల్లిని పోగొట్టుకున్న బాధలో తనలోని యాక్టింగ్‌ టాలెంట్‌ అంతటినీ అప్పుడే ప్రదర్శించేందుకు అనుకూలించకపోవచ్చు.. ఇలాంటి రకరకాల కారణాలతో ట్రైలర్‌ సాంగ్‌లో జాన్వీ అలా కనిపించి ఉండొచ్చేమో. 

ఏది ఏమైనా అతిలోక సుందరి కూతురు కదా. ఖచ్చితంగా విషయం ఉండి తీరాల్సిందే. మెల్ల మెల్లగా కొంచెం కొంచెంగా బయటికి వస్తుందేమో చూడాలి. అయితే ఇంకా ఇవన్నీ జస్ట్‌ ట్రైల్స్‌ మాత్రమే. జాన్వీ యాక్టింగ్‌ టాలెంట్‌ పూర్తిగా తెలియాలంటే ఈ నెల 20 వరకూ ఆగాల్సిందే మరి.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS