ప్రేమికుల అడ్డాగా మారిపోయిన బిగ్ బాస్ హౌస్

By iQlikMovies - July 03, 2018 - 17:47 PM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా విన్నా బిగ్ బాస్ గురించిన చర్చనే... బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులు రోజు చేసే పనుల పైనే అందరి దృష్టి నెలకొని ఉంది.

ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ కూడా ఇంటి సభ్యుల మధ్యన పోటీలు పెడుతూ వారిని పరీక్షిస్తున్నారు. ఇక ఈరోజు రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఆ ప్రోమో ప్రకారం ఈరోజు ఇంటి సభ్యులు ప్రేమికులుగా చేసే టాస్క్ ఇచ్చినట్టుగా అర్ధమవుతుంది.

ఇక ఆ టాస్క్ లో భాగంగా కౌశల్-దీప్తి, రోల్ రైడా-దీప్తి సునైనా, తనీష్-నందిని, అమిత్-భాను, సామ్రాట్-తేజస్వి లు ప్రేమికులుగా టాస్క్ చేస్తుండగా వారిని అడ్డుకునే వార్దేన్స్ గా బాబు గోగినేని, గీతా మాధురి, గణేష్ & శ్యామల లో కనిపిస్తున్నారు.

ఇప్పటికే హౌస్ లో ఉన్న సామ్రాట్-తేజస్వి లు ప్రేమలో ఉన్నారు అంటూ ఇంటి సభ్యుల మధ్యే పెద్ద చర్చలు జరగడంతో ఈ టాస్క్ మరింత ఆసక్తిగా మారింది.

మొత్తానికి ఈ రోజు టాస్క్ పైన అందరి దృష్టి నెలకొంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS