ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఈనెలలో లాంఛనంగా ప్రారంభించి.. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు తారక్ ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రానికి ఈనెల 24న కొబ్బరికాయ కొట్టనున్నారని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు వినిపించింది. దాదాపు ఆమె పేరే ఖరారైయ్యే అవకాశం వుంది. వారం క్రితం జాన్వీ ఈ సినిమా ఫోటో షూట్ కోసం హైదరాబాద్ వచ్చారని, దాదాపు ఆమె ఎంపిక ఖయమైయిందని తెలుస్తోంది. జాన్వీ తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో రావడం గ్రాండ్ ఎంట్రీ అనే భావించాలి.