సమంత ఆధ్యాత్మిక మార్గంలో వున్నారు. ఇటివలే ఆమె జప మాలతో కనిపించారు. తాజాగా తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. ఆ దేవాలయంలో 600 మెట్లు ఉండగా ప్రతీ మెట్టుపై హారతి కర్పూరం వెలిగించారని,అనంతరం స్వామివారిని దర్శించుకున్నారని తెలిసింది. దిని సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత మానసిక ప్రశాంతత కోసం అక్కడికి వెళ్లారు. అరుదైన ఈ వ్యాధి బారిన పడినట్టు ఆమె గతేడాది వెల్లడించిన సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా ఇటీవల.. ఐవీఐజీ సెషన్‌కు హాజరైనట్లు చెప్పారు సమంత సినీ కెరీర్ విషయానికొస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘ఖుషి సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సివుంది.