జాన్వీ టాలీవుడ్‌కి వస్తుందా? రాదా?

మరిన్ని వార్తలు

అతిలోక సుందరి శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె జీవించి ఉంటే, ఖచ్చితంగా జాన్వీ తెలుగు సినిమాల్లో కూడా నటించేదే. తల్లి మరణంతో జాన్వీ తెలుగు సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు. ఎందుకంటే, జాన్వీకపూర్‌ పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టింది.

 

తెలుగు సినీ ప్రముఖులు అప్రోచ్‌ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ అవకాశం ఆమె ఇచ్చేలా కూడా కనిపించడం లేదు. అయితే ఓ ప్రముఖ తెలుగు సినీ నిర్మాత జాన్వీతో తెలుగులో నటింపచేయాలని చాలా కష్టపడుతున్నాడట. ఇటీవల ముంబై వెళ్లి బోనీ కపూర్‌తో మంతనాలు కూడా జరిపాడట. అయితే ప్రస్తుతానికి జాన్వీ 'ధడక్‌' సినిమా మీదనే పూర్తిగా కాన్‌సన్‌ట్రేషన్‌ చేసిందనీ, ఇప్పట్లో ఆమె తెలుగు సినిమాల్లో నటించకపోవచ్చుననీ, సదరు నిర్మాతకు బోనీ కపూర్‌ చెప్పేశాడట. 

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్దాకపూర్‌ తెలుగులో నటిస్తోంది. చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో సత్తా చాటాలనుకుంటున్నారు. జాన్వీ కూడా అలాగే ఆలోచిస్తే, మంచిదేమో. కానీ, అందుకు ఆమెకు ఏమి ఇబ్బందులున్నాయో ఎవరికీ తెలియదు. శ్రీదేవి జీవించి ఉంటే, హీరోయిన్‌గా తనకి స్టార్‌డమ్‌ ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమలోకి తన కుమార్తైను కూడా ఖచ్చితంగా తీసుకొచ్చేదే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS