జాన్వీ ఏం చేసినా ఫ్యాన్స్‌ ఫిదానే.!

By Inkmantra - February 25, 2020 - 17:05 PM IST

మరిన్ని వార్తలు

అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్‌ ఏం చేసినా ఫ్యాన్స్‌కి పండగే. మీడియాలో హాట్‌ టాపిక్కే. ఎక్కడికెళ్లినా ఆమెపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచే కెమెరాలు.. కావల్సినంత హైప్‌ తీసుకొస్తుంటాయి జాన్వీకి. ఇక తనను అంతలా అభిమానించే అభిమానుల కోసం అంతర్జాంలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది జాన్వీ కపూర్‌. అలా తన ఫాలోవర్స్‌ కోసం జాన్వీ ప్రస్తుతం ఓ డాన్సింగ్‌ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పాత హిందీ సాంగ్‌కి, కొరియోగ్రాఫర్‌తో కలిసి సీరియస్‌గా జాన్వీ వేస్తున్న స్టెప్పులు నెటిజన్స్‌ని చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

When u lose balance so u have to improv an over dramatic end 🕺🏼🎶🌈

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

జాన్వీ డాన్స్‌ అద్భుతంగా ఉంది.. అచ్చు శ్రీదేవిని చూసినట్లుంది. తల్లికి తగ్గ తనయ.. అంటూ రకరకాల కామెంట్స్‌తో జాన్వీని ఆకాశానికెత్తేస్తున్నారు అభిమానులు. ఏమాటకామాటే చెప్పుకోవాలి స్కై బ్లూ అండ్‌ వైట్‌ కలర్‌ చుడీదార్‌ ధరించి జాన్వీ వేసిన ఈ స్టెప్పులు నిజంగానే మైమరిపిస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ ‘తఖ్త్‌’ మూవీలో నటిస్తోంది. జాన్వీతో పాటు రణ్‌వీర్‌ సింగ్‌, అలియాభట్‌, కరీనా కపూర్‌, అనిల్‌ కపూర్‌, భూమి పడ్నేకర్‌ ఇంపార్టెంట్‌ రోల్స్‌ పోషిస్తున్న ఈ సినిమాని కరణ్‌ జోహార్‌ రూపొందిస్తున్నారు. మొగలుల కాలం నాటి బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో సెట్స్‌ మీదికి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది క్రిస్మస్‌కి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు జాన్వీ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న భారత తొలి మహిళా పైలెట్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌ ఏప్రిల్‌ 24న రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. వీటితో పాటు ‘రూహీ అఫ్జానీ’, ‘దోస్తానా 2’ సినిమాల్లో జాన్వీ ఇంపార్టెంట్‌ రోల్స్‌ పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS