సినిమా వ్యక్తిని పెళ్లి చేసుకోనంటోన్న పాయల్‌.!

మరిన్ని వార్తలు

వాలెంటైన్స్‌ డేకి తన ప్రియుడి గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్‌ చేసుకుని, వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచిన పంజాబీ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌, ఇప్పుడు పెళ్లి ముచ్చట కూడా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. లవ్‌ మ్యారేజ్‌ మాత్రమే చేసుకుంటుందట. కానీ, సినిమాల్లో వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోనని నిక్కర్చిగా చెప్పేస్తోంది. సినిమా రంగానికి దూరంగా ఉన్న అమ్మాయిలకు సినిమా వ్యక్తుల్ని పెళ్లాడడంపై ఓ రకమైన అభిప్రాయం ఉంటుంది. అలాంటిది ఆ రంగుల ప్రపంచంలోనే ఉండి. వారి సాధక, బాధకాలు తెలిసిన అమ్మాయి అయిన పాయల్‌ ఇలా అనడం విమర్శలకు తావిస్తోంది.

 

ఇదిలా ఉంటే, ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో బోల్డ్‌ బ్యూటీ అనే ఇమేజ్‌ సంపాదించుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌, ఆ ఇమేజ్‌ని దూరం చేసుకోవడానికి పడిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. ‘వెంకీ మామ’ సినిమాతో ఎట్టకేలకు ఆ ఇమేజ్‌కి నీళ్లొదిలినా, వరుస ఆఫర్స్‌ అందుకోవడంలో ఇంకా వెనకబడే ఉంది. ‘వెంకీ మామ’ సూపర్‌ హిట్‌ చేతిలో ఉన్నా, ‘డిస్కో రాజా’ ఫ్లాప్‌ ఎఫెక్ట్‌ అమ్మడిపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లుంది. మరి వేరే ఇండస్ట్రీలో ఛాన్సెస్‌ కోసమేమైనా ట్రై చేస్తుందా.? అంటే అదీ లేదట. బోల్డ్‌ ఇమేజ్‌లో శిఖరాల్ని అందుకున్న ఈ బేబీకి ఇంతవరకూ బాలీవుడ్‌ నుండి పిలుపే రాకపోవడం మరింత ఆశ్చర్యకరం.

 

అలా అని తమిళ తంబీలు కూడా పాయల్‌ స్కిన్‌ షోని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. సో హండ్రెడ్‌ పర్సంట్‌ టాలీవుడ్‌నే నమ్ముకున్న ఈ ముద్దుమ్ముకి టటాలీవుడ్‌ ఫిలిం మేకర్స్‌ మొహం చాటేస్తున్నారెందుకో. చూడాలి మరి, భవిష్యత్‌లో ఈ పంజాబీ బ్యూటీ ఎలాంటి క్రేజీ ఆఫర్‌ చేజిక్కించుకుంటుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS