జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు..? ఇదే విషయంపై ఎప్పటి నుంచో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన నటించమని నిర్మాతలు జాన్వీని సంప్రదించారని, కానీ జాన్వీ మాత్రం `నో` చెప్పిందని రకరకాల వార్తలొచ్చాయి. అంతే కాదు.. జాన్వీ తెలుగులో నటించడానికి ఏమాత్రం సముఖంగా లేదని కూడా చెప్పుకొన్నారు. వీటిపై జాన్వీ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేసింది.
``ఎన్టీఆర్ లెజెండ్. తన నటన కి నేను అభిమానిని. అలాంటి ఎన్టీఆర్ తో నటించడానికి అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకొంటారు? నేను సైతం ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా`` అని చెప్పేసింది. అంతే కాదు.. తెలుగు చిత్రసీమ అంటే తనకు గౌరవమని, ఇక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా `నో` చెప్పనని క్లారిటీ ఇచ్చింది జాన్వీ. సో.. ఇప్పటి వరకూ జాన్వీపై వచ్చినవన్నీ పుకార్లే అన్నమాట. ఎన్టీఆర్ కోసం జాన్వీని సంప్రదించారన్న వార్తల్లోనూ నిజం లేనట్టే. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో ఓసినిమా రాబోతోంది. అందులో జాన్వీనే హీరోయిన్ అని టాక్. ఈసారైనా ఈ జంటని తెరపై చూడడం కుదురుతుందో, లేదో?