బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అంధదూన్ ని మేస్ట్రోగా రిమేక్ చేశారు మేర్లపాక గాంధీ. నితిన్ హీరోగా చేసిన ఈ సినిమా ఓటీటీకే పరిమితమైయింది. అయితే ఇంక జీవితంలో మళ్ళీ రిమేక్ చేయని చెబుతున్నారు మేర్లపాక గాంధీ. ఆయన తాజా చిత్రం 'లైక్ షేర్ & సబ్స్క్రైబ్' ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లో దీనిపై మాట్లాడారు.
''జీవితంలో మళ్ళీ రీమేకులు చేయను. రీమేకుల్లో కిక్కు లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా తేలికగా సెట్స్ కి వస్తారు. ఆల్రెడీ వారికి ఒక విజువల్ వుంటుంది. అలానే చేయాలి కదా అనే ఫీలింగ్ వాళ్ళలో కనిపిస్తుంది. అవసరమైతే చిన్న సినిమా చేస్తాను కానీ మళ్ళీ రిమేక్ ముట్టుకొను. ఆ మధ్య ఒక పెద్ద హీరో రీమేక్ సినిమా అవకాశం వస్తే మరో ఆలోచన లేకుండా నో చెప్పాను. ఓటీటీ ప్రభావం పెరిగిన ఈ రోజుల్లో రీమేక్ కి ఇంకా మనుగడ ఉంటుందని నేను అనుకోను'' అని అభిప్రాయపడ్డారు మేర్లపాక గాంధీ.