హిందూ ఇతిహాసాల్లో 'రామాయణం' కి ప్రత్యేక స్థానం ఉంది. అన్ని భాషల్లోనూ, అందరి డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్ని సార్లు ఎంత మంది తెరకెక్కించినా, క్రేజ్ తగ్గని అద్భుత కావ్యం రామాయణం. ఎంతో మంది లెజెండ్రీ డైరక్టర్స్, హీరోలు ఈ రామాయణంలో భాగమయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ కూడా రామాయణ కథ ఆధారంగా సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం కొందరి నటీ నటులను కూడా అనుకున్నారు. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ ని. రావణుడి పాత్రలో కన్నడ క్రేజీ స్టార్ యశ్ ని ఫిక్స్ చేసారు. ఇంకో ముఖ్య పాత్ర అయిన సీతగా మొదట ఆలియా భట్ ను అనుకున్నా, కొన్ని కారణాలవల్ల ఆలియా తప్పుకోవడంతో ఆ స్థానంలో సాయి పల్లవిని ఫిక్స్ చేశారు.
సాయి పల్లవి లుక్ టెస్ట్ చేయగా పర్ఫెక్ట్ గా సూట్ అయిందని, త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెడతారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఏమయ్యిందో ఏమో జాన్వి కపూర్ సీతగా నటించే అవకాశం ఉందని లేటెస్ట్ సమాచారం. మూవీ టీమ్ జాన్వీని సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. ప్రజంట్ సౌత్ లో బిజీ గా ఉన్న జాన్వీకి బంపర్ ఆఫర్ లభించినట్టే. వచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకుంటే జాన్వీ కపూర్ అన్ని భాషల్లోనూ శ్రీదేవి హవా కొనసాగిస్తుంది అనటంలో సందేహం లేదు.
హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇవన్నీ నిజాలో కాదో తెలియాలంటే ఈ రామాయణానికి సంబంధించి అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతోంది. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డిఎన్ఈజీ ఈ మూవీకి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అందించనుంది.