టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుని ఒక వైపు తన హెల్త్ కోసం ట్రీట్ మెంట్ తీసుకుంటూ , ఇంకో వైపు హాలిడే ఎంజాయ్ చేస్తోంది. సామ్ మళ్ళీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ తో వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . సామ్ నటించిన 'సీటా డెల్' వెబ్ సిరీస్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఖుషి తరవాత సమంత నటించిన ఏ మూవీ రిలీజ్ కాకపోవటంతో సామ్ మూవీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
సమంత అందంతో పాటు నటనతో బాగా ఆకట్టుకుంటుంది. తనకిచ్చిన పాత్ర కి వంద శాతం న్యాయం చేకూరుస్తుంది. అందుకే ఇప్పటికీ అగ్ర శ్రేణి హీరోయిన్ గా కొనసాగుతోంది. సామ్ తో ఒకసారి వర్క్ చేసిన ఎవరైనా మళ్ళీ కలిసి వర్క్ చేయాలనుకుంటారు. అందరి టాప్ హీరోలతో నటించిన సామ్ సీనియర్ హీరోలతో ఇప్పటివరకు జట్టు కట్టలేదు. కానీ బాలయ్య సినిమాలో సామ్ కనిపిస్తుంది అన్న వార్త సొషల్మీడియాలో హల్చల్ చేస్తోంది.
వరస విజయాలతో జోరు మీదున్న బాలయ్య నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోనే సామ్ మెరవనుంది. కానీ హీరోయిన్ గా కాదు, గెస్ట్ రోల్ కూడా కాదు. ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయట. ఆ టైంలో ఏం మాయ చేసావే క్లిప్స్ కొన్ని ప్లే అవుతాయని, అందులో సమంత పాత్రను బాగా హైలెట్ చేస్తారని టాక్. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బాలయ్య తో నటించే ఛాన్స్ సామ్ కి ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.