చరణ్ కోసం జాన్వీ ని అడిగితే...?

మరిన్ని వార్తలు

అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీకపూర్ ఇప్పటివరకు బాలీవుడ్ లో సత్తాచాటింది. మొదటిసారి దేవర సినిమా కోసం సౌత్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానుంది. 2 పార్ట్స్ గా వస్తున్న ఈ మూవీలో జాన్వీ లీడ్ రోల్ లో నటిస్తోంది.   నెక్స్ట్ కూడా జాన్వీకి సౌత్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ తరవాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో  చేయబోయే RC 16 లో కూడా జాన్వీని ఫిక్స్ చేశారు. మొదట రవీనా టాండన్ కూతురు హీరోయిన్ అనుకున్నారు, కానీ పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ మూవీలో ఇప్పటికే క్రేజ్ ఉన్న జాన్వీ అయితే బెటరని, తనని ఫిక్స్ చేసినట్టు సమాచారం.


ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్న చెర్రీ, ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి, జూన్ లో బుచ్చి బాబుతో RC16 ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.  అందుకోసమే హీరోయిన్ ని ఫైనల్ చేసారు. ప్రజంట్ చెర్రీకి ఉన్న డిమాండ్ కారణంగా  చాలామంది హీరోయిన్స్ చెర్రీతో నటించటానికి, ఇంట్రస్ట్ గా ఉన్నప్పటికీ జాన్వికి ఈ అద్భుత అవకాశం లభించింది.  చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత జాన్వీని ఫైనల్ చేశారుట మేకర్స్.  ఈ స్పోర్ట్స్ డ్రామాలో  చెర్రీ సరసన నటించేందుకు జాన్వి కపూర్  6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.


టాలీవుడ్ లో ఇప్పుడు జాన్వీకి ఇచ్చిన రెమ్యునరేషనే ఎక్కువ. స్టార్ హీరోయిన్స్ కి ఎవరికీ ఇంత పారితోషికం ఇవ్వలేదు.  గత ఏడాది వరస సినిమాలు చేసిన శ్రీలీల కూడా కేవలం రెండు కోట్ల రెమ్యూనరేషన్. అలాంటిది జాన్వీ రెండో సినిమాకే ఆరు కోట్ల పారితోషికమా? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.  హిందీలో 3.5 కోట్ల పారితోషకం తీసుకునే ఈమెకి సౌత్ లో భారీగానే ముట్టింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS