ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకోసం పెట్టె బడ్జెట్ గూర్చి ఎవరు వెనకాడటం లేదు. ఎందుకంటే రిలీజ్ కి ముందే, ప్రీరిలీజ్ బిజినెస్ జరిగి అమౌంట్ వచ్చేస్తుంది. థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్, అని పలు రకాలుగా బిజినెస్ జరుగుతోంది. అంతేకాక 5 , 6 భాషల్లో రిలీజ్ చేయటం వలన ఓపెనింగ్స్ బానే వస్తున్నాయి. అందుకే పెద్ద సినిమాలకి ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోంది. స్టార్ హీరోల సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయి. ప్రజంట్ తెలుగులో ఇలాంటి అంచనాలతో వస్తున్న సినిమాలలో కల్కి 2898 ఏడీ మూవీ ఒకటి.
కల్కి మూవీ ఓవర్సీస్ రైట్స్ కోసం మేకర్స్ 100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ లో 12 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధిస్తేనే ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయి. దీనితో డిస్ట్రిబ్యూటర్లు మాత్రం 70 , 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ గా కల్కి ఓవర్సీస్ రైట్స్ ఎంత మొత్తానికి అమ్ముడవుతాయో చూడాలి. కల్కి 2898 ఏడీ బిజినెస్ పరంగా కూడా సరికొత్త రికార్డులను సొంతం చేసుకునేలా ఉంది.
రీసెంట్గా కల్కి సినిమా 25 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఇండియన్ సినిమా ఇదే కావటం గమనార్హం. ఏపీ హక్కుల కోసం కూడా గట్టి పోటీ నెలకొందని టాక్ . కమల్ హాసన్, అమితాబ్, దీపికా, దిశాపటాని లాంటి స్టార్స్ ఉండటం తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న కల్కి మూవీకి రికార్డ్ స్థాయిలో వసూళ్లు వస్తాయని అంతా నమ్మకంతో ఉన్నారు.