శ్రీదేవి కూతురుగా చిత్రసీమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్... ఇప్పుడు తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సృష్టించుకుంటోంది. ధడక్ సినిమా హిట్టవ్వడంతో జాన్వీకి అక్కడ ఆఫర్లు వరుస కడుతున్నాయి. గుంజన్ సక్సేనాకీ మంచి పేరే దక్కించుకుంది. ఇప్పుడు నయనతార పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధం అవుతోందని టాక్. నయనతార నటించిన తమిళ చిత్రం `కొలమావు కోకిల`.
తెలుగులో `కో.. కో.. కోకిల`గా డబ్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. నయన పాత్రకు గానూ జాన్వీ కపూర్‌ని ఎంచుకున్నారని సమాచారం. ఇటీవల `కొలమావు కోకిల` చూసిన జాన్వీ.. ఈ రీమేక్‌లో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. తెలుగులోనూ జాన్వీకి మంచి ఆఫర్లే వెళ్తున్నాయి. కానీ.. సౌత్ ఇండియాలో అడుగుపెట్టడానికి జాన్వీ ఎందుకనో ఆలోచిస్తోంది. ఓ బడా స్టార్ సినిమాతోనే టాలీవుడ్ లో అడుగుపెట్టాలన్నది జాన్వీ ప్రయత్నం. మరి ఆ అవకాశం ఎప్పుడు అందుతుందో?