తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన దర్శకుల జాబితాలో అనుదీప్ కూడా చేరిపోతాడు. జాతి రత్నాలుతో... అనుదీప్ బాగా నవ్వించాడు. హీరోలందరి దృష్టిలో పడ్డాడు. జాతి రత్నాలు సినిమాకి మంచి టాక్ రావడంతో.. నిర్మాతలు అనుదీప్ కి అడ్వాన్సులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. హీరోలు కూడా.. అనుదీప్ కి టచ్ లో వెళ్తున్నారు. అయితే ఇప్పటికే వైజయంతీ మూవీస్ లో ఓ సినిమా చేయడానికి అనుదీప్ అడ్వాన్సు తీసుకున్నాడని టాక్.
తొలి సినిమాని స్వప్న సినిమా బ్యానర్‌లో చేసిన అనుదీప్... రెండో సినిమా కూడా మాతృ సంస్థ అయిన వైజయంతీకి కమిట్ అయ్యాడట. హీరోగా రామ్ ఫిక్స్ అయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో రామ్ ఓ సినిమా చేయాలి. అందుకు తగిన కథ కోసం అశ్వనీదత్ చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. జాతిరత్నాలు హిట్ తో.. ఆ ఛాన్స్ అనుదీప్ కి వెళ్లినట్టు తెలుస్తోంది.
రామ్ ఇప్పుడు పూర్తిగా మాస్ కథలపై దృష్టి పెట్టాడు. మరి ఈ సినిమా అనుదీప్ స్టైల్ లో ఫన్ రైడ్ గా ఉంటుందా? లేదంటే.. రామ్ తరహా... మాసీ స్పైసీగా ఉంటుందా అన్నది తేలాల్సివుంది. ఇప్పటికైతే కథేం లేదు. అన్ని కమిట్మెంట్స్ కుదిరాక... స్క్రిప్టు పనులు మొదలవుతాయి. అప్పటి వరకూ ఎదురు చూడాల్సిందే.