కృష్ఱవంశీకి క్రియేటీవ్ డైరెక్టర్ గా మంచి పేరుంది. అందరి రూటు వేరు - కృష్ణవంశీ రూటు వేరు. బలమైన కథా కథనాలు, పిక్చరైజేషన్, పాటలు.. ఈ విషయంలో.. కృష్ణవంశీ తన ప్రతాపం చూపిస్తుంటాడు. అయితే కొన్నాళ్లుగా తనకు హిట్టు లేదు. ప్రస్తుతం `రంగ మార్తాండ` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తదుపరి చేయబోయే సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా ప్రకటించేశాడు. దానికి `అన్నం` అనే పేరు పెట్టాడు.
ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఈ సినిమాలో ఓ అగ్ర హీరో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇది వరకు కృష్ణవంశీ `రైతు` అనే కథ సిద్ధం చేశాడు. అది బాలయ్యకు వినిపించాడు. అందులో ఓ కీలకమైన పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని సంప్రదించారు. ఆయన నో...,చెప్పడంతో ఆ కథ అటకెక్కింది.
ఇప్పుడు అదే కథని.. కొన్ని మార్పులు చేసి (అమితాబ్ పాత్రని తప్పించి) కొత్తగా రాసుకున్నాడట. సో.. ఇది మళ్లీ బాలయ్య దగ్గరకే వెళ్లడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య ఓకే అంటే.. ఈ యేడాదే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.