శివగామీ - ఆ వయసేంటి? ఆ గ్లామరేంటి?

మరిన్ని వార్తలు

జస్ట్‌ ఫర్‌ విమెన్‌ (జెఎఫ్‌డబ్ల్యు) కవర్‌ పేజీ మీద ఇదిగో ఇలా మెరిసింది ముద్దుగుమ్మ రమ్యకృష్ణ. ఈ పోజులో రమ్యకృష్ణ సింప్లీ సూపర్బ్‌ అంతే. ఒకప్పుడు గ్లామరస్‌ తారగా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్‌డమ్‌ సంపాదించుకుంది రమ్యకృష్ణ. ఆమె కెరీర్‌లో ది బెస్ట్‌ రోల్స్‌ అంటే రజనీకాంత్‌ హీరోగా నటించిన 'నరసింహ'లోని 'నీలాంబరి' పాత్ర, 'బాహుబలి'లోని శివగామి పాత్రలను చెప్పుకోవచ్చు. 'బాహుబలి'లో శివగామి పాత్ర రమ్యకృష్ణకు న భూతో న భవితష్యతి. ఆ పాత్రకున్న హుందాతనం, ఆమె ప్రదర్శించిన నటన అన్నీ అమోఘాలే. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆ పాత్రని మర్చిపోలేం. అలాంటిది వయసు మీద పడ్తున్నా రమ్యకృష్ణలో గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదు. అలాగే ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ పట్ల ఆమెలో ఆసక్తి తగ్గలేదు. ఆ విషయం ఈ ఫొటోతో అర్థమవుతుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి రమ్యకృష్ణ రూపలావణ్యం వెరీ వెరీ స్పెషల్‌. ఈ ఫోటోలో ఆమె ట్రెండీ కాస్టూమ్‌లో ఇచ్చిన పోజు వారెవ్వా అనిపిస్తోంది. యంగ్‌ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఆమె అంద చందాలు. అందుకే గ్లామర్‌ ప్రపంచంలో ఆమె ఈ స్థాయికి ఎదిగింది. ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. గ్లామర్‌తో పాటు, హుందా అయిన పాత్రలకీ రమ్యకృష్ణని మించిన ముద్దుగుమ్మ లేరనే చెప్పాలి. 'సోగ్గాడే చిన్ని నాయానా' సినిమాలో నాగార్జున అందుకే అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఆమె అందం అలాగే ఉంది అని. ఆ సినిమాలో యంగ్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠికి పోటీ ఇచ్చింది గ్లామర్‌లో రమ్యకృష్ణ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS