నేను రామ్ చరణ్ మాట వినలేదు: జయంత్ సి పరాన్జీ

మరిన్ని వార్తలు

ప్రేమించుకుందాం రా, శంకర్ దాదా MBBS వంటి ఘన విజయాలు అందించిన దర్శకుడు జయంత్. 

ఈ దర్శకుడిని చూస్తే చాలా జోవియల్ గా, కూల్ గా కనిపిస్తుంటాడు అలాగే ఆయన డ్రెస్సింగ్ కూడా ఎప్పుడు ఒక టీ-షర్టులో ఉంటాడు. దీనికి కారణం ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. నాకు ఇలా టీ- షర్టులో ఉండడమే సౌకర్యంగా ఉంటుంది అని చెబుతుంటాడు.

ఇక ఇదే విషయమై ఒక ఇంటర్వ్యూ లో అడగగా- జయంత్ తన డ్రెస్ విషయంలో ఒకసారి రామ్ చరణ్ చెప్పినా కూడా వినలేదు అని చెప్పాడు. అదేంటంటే- చిరు 60వ పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కి అందరు బ్లాక్ సూట్ అండ్ టై లో రావాలని డ్రెస్ కోడ్ ఉందంటూ జయంత్ కి ఫోన్ చేసి మరి చెప్పాడట.

కాని తాను మాత్రం ఎప్పటిలాగే టీ-షర్టులో పార్టీకి వెళ్ళాను అని చెప్పాడు. ఇది చూసి రామ్ చరణ్ కూడా మిమల్ని మార్చడం కష్టం సార్ అంటూ నవ్వేసాడట. ఇలా తనకి జరిగిన ఓ సరదా సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS