కన్ను తెరిస్తే జననం - కన్ను మూస్తే మరణం... రెప్పపాటే ప్రయాణం అన్నాడో మహానుభావుడు. ఎప్పుడు పుడతామో తెలీదు, ఎప్పుడు మరణిస్తామో తెలీదు. మన పుట్టుక మనం డిజైన్ చేసుకోలేం. చావు కూడా అంతే. కాకపోతే... `ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా చనిపోతే చాలు..` అని దేవుడ్ని కోరుకోవడం సహజం. నటుడు జయప్రకాష్ రెడ్డి కూడా ఇలానే అనుకునేవారు. మరణం ప్రస్తావన ఎప్పుడు వచ్చినా.. `నిద్రలోనే నొప్పి లేకుండా అయిపోవాలి` అని చెబుతుండేవారు.
''మన చావు ముందే భగవంతుడు రాసి పెట్టేసి ఉంటాడు. దాని ప్రకారం జరిగిపోతుంది. కానీ.. నిద్రలోనే, ఎలాంటి నొప్పి లేకుండా చనిపోతే చాలు. మంచం మీద ఉండి ఒకరితో సేవ చేయించుకోకూడదు. భగవంతుడ్ని నేను అదే కోరుకుంటా'' అని ఓ సందర్భంలో చెప్పారు జేపీ. నిజంగానే.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, మంచంపై ఉండి, సేవ చేయించుకోకుండా... సైలెంట్ గా వెళ్లిపోయారు. జేపీ ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఈ క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. `అయ్యో.. ఆయన మరణాన్ని కూడా ముందే ఊహించారా` అంటూ అభిమానులు కన్నీరు కారుస్తున్నారు.
జీవిత ముగింపు కూడా ముందే ఊహించిన గణిత ఉపాధ్యాయ విలక్షణ నటుడు #JayaPrakashReddy Garu 💐🙏🏻 pic.twitter.com/KJEDAvwFXS
— Ajay Tarock (@vivaceAjay) September 9, 2020