సినిమాల్లో స్టార్డమ్ లేకున్నా, అతిలోక సుందరి కూతురు అనే ట్యాగ్‌లైన్ జాన్వీకపూర్‌ని స్టార్‌ని చేసేసింది. చేసింది ఒక్క సినిమానే అయినా, ఆమెకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా జాన్వీని అభిమానించేవారున్నారు. 'ధడక్' సినిమాతో హీరోయిన్గా డెబ్యూ చేసిన జాన్వీ ఈ సినిమాలో పెద్దగా గ్లామర్ ప్రదర్శించే అవకాశం రాలేదు. ఆ తర్వాత కూడా వరస సినిమాల్లో కనిపించలేదు జాన్వీ. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా గ్లామర్ పాత్రలు కావు. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే. సో ఇది ఇలాగే కొనసాగితే, తనను హోమ్లీ హీరోయిన్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారనుకుందో ఏమో కానీ, జాన్వీ బహిరంగంగా కనిపించేటప్పుడు విచ్చలవిడిగా గ్లామర్ ప్రదర్శించాలనుకుంటుంది. పొట్టి పొట్టి దుస్తుల్లో ఘాటు ఘాటుగా ఎక్స్పోజింగ్ చేస్తూ, కెమెరా కంటికి చిక్కుతుంటుంది. ఆ రకంగా తనలోని గ్లామర్ టాలెంట్‌ని బయట పెడుతూ ఉంటుంది.
జాన్వీ నుండి ఏ చిన్న హాట్ అప్డేట్ వచ్చినా నిమిషాల్లో అది వైరల్ అయిపోతుంటుంది. అన్నింటికీ మించి ఇన్నర్ వేర్ కాల్విన్ క్లెయిన్కి దిశా పటానీ అంబాసిడర్ అయితే, పొట్టి నిక్కరుకు జాన్వీ కపూర్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. సమస్యే లేదు, బహిరంగ ప్రదేశాల్లో జాన్వీ ఎప్పుడూ వీలైనంత పొట్టి నిక్కర్లలో కనిపించడానికే ఇష్టపడుతుంటుంది. అదే తనకు కంఫర్ట్ అంటుంది. ఇకపోతే, తాజాగా జాన్వీ కపూర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏముందయ్యా అంటే, నడుం తిప్పుతే తెగ వయ్యారాలు పోతోంది. అదేనండీ బెల్లీ డాన్స్ అంటారే అది. ఏమాటకామాటే చెప్పుకోవాలి బెల్లీ డాన్స్ ఇరగదీసింది జాన్వీ. అయితే ఒక్క మాట.. ఇక్కడ కూడా కాస్ట్యూమ్ మాత్రం ఛేంజ్ చేయలేదండోయ్. సేమ్ పొట్టి నిక్కర్ అంతే.