ఇస్మార్ట్ శంకర్‌తో ఓ సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు తన దృష్టంతా `ఫైటర్`పైనే ఉంది. విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గురించి టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలన్నది పూరి ఆలోచన. అందుకే బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్‌ని రంగంలోకి దింపుతున్నాడు. శ్రీదేవి కూతురు.. పూరి సినిమా... విజయ్ హీరో అంటే ఆ కాంబినేషన్‌కి ఇంకా పిచ్చ ఊపు వచ్చేస్తుంది. కాకపోతే జాన్వీ కపూర్ డేట్లు ఇప్పుడు అందుబాటులో లేవని తెలుస్తోంది.
జాన్వీ ఇప్పటికే కొన్ని బాలీవుడ్ సినిమాలకు సంతకాలు చేసేసింది. జాన్వి డేట్లు ఎప్పుడు ఫ్రీ అవుతాయో తెలియని పరిస్థితి. జాన్వీ కోసం షూటింగ్ వాయిదా వేసుకోవాలా? లేదంటే కొత్త హీరోయిన్ని వెదికి పట్టుకోవాలా అని పూరి ఆలోచిస్తున్నాడు. జాన్వీ మాత్రం నాకు కొంచెం టైమ్ కావాలి అని అడుగుతోందట. విజయ్ సినిమా, అందులోనూ పూరి దర్శకుడంటే.. జాన్వీ వదులుకోదు. అందుకే ఏదోలా డేట్లు సర్దుబాటు చేస్తుందని అనుకుంటున్నారు. మరి ఏం చేస్తుందో చూడాలి.