వహ్వా.! వాట్‌ ఏ బ్యాలెన్సింగ్‌ జాన్వీ.!

By Inkmantra - August 17, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

ఫిట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌. ఎక్కువ సమయం జిమ్‌కే కేటాయిస్తుంటుంది. పొట్టి పొట్టి డ్రస్సుల్లో ఆమె జిమ్‌కి వెళ్లున్నప్పుడూ, వస్తున్నప్పుడూ కెమెరాలు తమ పనిని చేయడంలో ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉంటాయి. ఇక తాజాగా జిమ్‌లో జాన్వీకపూర్‌, తన పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నమ్రతా పురోహిత్‌తో కలిసి ఓ బ్యాలెన్సింగ్‌ ఫీట్‌ చేసింది. ఈ ఫీట్‌ సాధారణ కెమెరాలకు చిక్కింది కాదు కానీ, నమ్రతనే తన పర్సనల్‌ అకౌంట్‌ ద్వారా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

 

ఈ పిక్‌కి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. జాన్వీ, నమ్రత ఒకరికొకరు బ్యాలెన్స్‌ చేసుకుంటూ చేసిన రేర్‌ ఫీట్‌ ఇది. ఈ ఫీట్‌ని పోస్ట్‌ చేస్తూ, దీని ప్రత్యేకతను కూడా ఆమె వివరించారు. ఈ ఫీట్‌లో బాడీ ఫంక్షనల్‌ మూమెంట్స్‌ ఉంటాయి. మజిల్స్‌ని స్ట్రాంగ్‌ చేసుకోవడానికి ఈ అరుదైన ఫీట్‌ ఉపయోగపడుతుంది.. అంటూ నమ్రత వివరించారు. అసలే జాన్వీ కపూర్‌కి సోషల్‌ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది. అలాంటిది ఈ టైప్‌ ఆఫ్‌ ఫీట్స్‌తో కనిపిస్తే, వదులుతారా? చెప్పండి. బోలెడన్ని కాంప్లిమెంట్స్‌తో కిర్రాకెత్తిపోతున్నారు నెటిజన్లు. వహ్వా.! జాన్వీ.. వాట్‌ ఏ బ్యాలెన్సింగ్‌.. అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.

 

'ధడక్‌' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకుంది జాన్వీ. ఆ సినిమా తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం జాన్వీ చేతిలో నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. అన్నీ ప్రెస్టీజియస్‌ అండ్‌ పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ ప్రాజెక్టులే కావడం విశేషం. 'కార్గిల్‌ గాళ్‌' అనే సినిమా కోసం జాన్వీ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా పాత్రలో జాన్వీ నటిస్తోంది. అలాగే తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన కరణ్‌ జోహార్‌ కాంబోలో 'తక్త్‌' అనే ఓ యాక్షన్‌ డ్రామాలోనూ జాన్వీ నటిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Support system! 🥰 @janhvikapoor and I balancing each other out! #PilatesGirls

A post shared by Namrata Purohit (@namratapurohit) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS