అతిలోక సుందరికి ఎంత కష్టమొచ్చిందో!

మరిన్ని వార్తలు

అతిలోక సుందరి ఎవరంటే అప్పటికీ ఇప్పటికీ ఆమె పేరే చెప్పి తీరాలి. ఎంతమంది ముద్దుగుమ్మలు వచ్చినా కానీ ఆమె పేరు అలా నిలిచిపోయిందంటే అది ఆమెకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. ఆమె ఇంకెవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముద్దుగుమ్మ శ్రీదేవి. హీరోయిన్‌గా గ్లామర్‌ రంగంలో ఒక వెలుగు వెలిగిన ధృవ నక్షత్రం శ్రీదేవి. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో రాబోతున్న ఆమె సినిమా 'మామ్‌'కి విడుదలకి ముందే అపురూపమైన ఆదరణ దక్కుతోంది. ఈ నెల మొదటివారంలోనే 'మామ్‌' విడుదల కానుంది. సినిమా పరంగా ఇంత ఆదరణ దక్కించుకుంటోన్న శ్రీదేవికి రియల్‌ లైఫ్‌లో మాత్రం పెద్ద కష్టమే వచ్చి పడింది. అందుకు కారణం ఆమె కూతురు జాన్వీ. ఆగండాగండి. కూతురు అంటే కూతురు తెచ్చి పెట్టిన కష్టమేమీ లేదు కానీ, ఆమె శ్రీదేవి కూతురు కదా. అందుకే మీడియాకి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యింది. ఎట్రాక్షన్‌ మాట అటుంచింతే, శ్రీదేవి కాలు బయట పెడితే చాలు, ఏదో ఒక కారణంతో ఆమె కూతురు జాన్వీ కపూర్‌ విషయమై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగించేస్తున్నారు. ఆమె సినీ తెరంగేట్రానికి సంబంధించి, శ్రీదేవి ఎంతగా క్లారిటీ ఇచ్చినా, మీడియా ఊరుకోవడం లేదు. రోజుకో న్యూస్‌ జాన్వీ కపూర్‌పై గాసిప్స్‌గా క్రియేట్‌ చేసి, బయటికి వదిలేస్తున్నారు. దాంతో శ్రీదేవి లాక్కోలేక పీక్కోలేక అన్నట్లుగా లోలోపల చాలా బాధపడుతోందట. తాజాగా జాన్వీ కపూర్‌ సినీ ఎంట్రీలో భాగంగా తల్లిలాగే ఆమె కూడా నోస్‌ సర్జరీ చేయించుకుంటోందంటూ, రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. అయ్యో అలాంటిదేమీ లేదంటూ శ్రీదేవి మీడియాని అభ్యర్దిస్తోంది. చివరికి జాన్వీ అసలు సినిమాల్లో నటిస్తుందో లేదో కూడా తెలీదు అనే మాట శ్రీదేవి నోటి వెంట వచ్చేలా చేసిందంటే మీడియా అత్యుత్సాహం ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS