రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జాన్వీ కపూర్‌కి క్రష్ ఇప్పటిది కాదు. 'అర్జున్ రెడ్డి' సినిమా టైంలోనే జాన్వీ కపూర్ నుండి విజయ్ దేవరకొండపై పోజిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి. అయితే, ఇప్పుడది ముదిరి పాకాన పడ్డట్లుంది. తాజాగా బాలీవుడ్‌లో ఓ రియాల్టీ ప్రోగ్రాంలో విజయ్ దేవరకొండపై తన ఫీలింగ్స్ గురించి జాన్వీ కపూర్ ఓపెన్ అయిపోయింది. విజయ్‌పై చాలా కాలంగా తనకు క్రష్ ఉందనీ, ఇప్పటికే చాలా ఫీలర్స్ పంపించాను కానీ, విజయ్ రెస్పాండ్ కాలేదనీ, జాన్వీ చెప్పింది.
అయితే, జాన్వీ సీరియస్‌గానే ఈ రెస్పాన్స్ ఇచ్చిందా? జస్ట్ టైం పాస్‌కి.. ఏదో విజయ్ దేవరకొండ గురించి అడిగారు కాబట్టి ఇలా రెస్పాండ్ అయ్యిందా? అనేది తెలీదు కానీ, ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'ఫైటర్' సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒకవేళ విజయ్ పట్ల జాన్వీకి ఉన్న అభిప్రాయం నిజమే అయితే, ఈ సినిమాలో నటించేందుకు పెద్దగా అభ్యంతరం లేనట్లే జాన్వీకి. ఇకపోతే, తనని హీరోయిన్‌గా పరిచయం చేసిన కరణ్ జోహార్ హ్యాండ్ కూడా ఈ సినిమాపై ఉండడంతో, దాదాపు జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ నిజమయ్యేలానే ఉంది. ఈ సినిమాని బాలీవుడ్‌లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.