గ్లామర్ టాలెంట్, యాక్టింగ్ టాలెంట్ రెండూ ఉన్నాయి. కానీ, అవకాశాలు మాత్రం అరుదుగా దక్కాయి. అరుదు అని చెప్పలేం కానీ, దక్కించుకున్న అవకాశాల్లోనే తనదైన శైలి ఇంపార్టెన్స్ చూపించింది ముద్దుగుమ్మ కేథరీన్. ప్రస్తుతం ఈ బ్యూటీ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు, తాజాగా ఈ బ్యూటీ పేరు మరో రెండు ప్రెస్జీజియస్ ప్రాజెక్టుల్లో ఛాన్స్ కొట్టేసిందంటూ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు.. అంటే, నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రంలో కేథరీన్ లీడ్ హీరోయిన్‌గా ఎంపికైందంటూ ప్రచారం జరుగుతోంది. బోయపాటి శీను ఈ సినిమాకి దర్శకుడు.
మరోవైపు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ దృష్టి కూడా కేథరీన్ పైనే ఉన్నట్లు తాజా సమాచారం. 'ఎంత మంచి వాడవురా' సినిమా తర్వాత కళ్యాణ్‌రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా కేథరీన్‌ని ఎంచుకోవాలనుకుంటున్నాడట. అయితే, కేథరీన్‌తో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌కీ చోటుందట. మరి మన ఎమ్మెల్యే పాప సెకండ్ హీరోయిన్‌నా.? లేక గెస్ట్ హీరోయిన్‌నా.? అనేది చూడాలిక.