ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సలార్`. శ్రుతిహాసన్ కథానాయిక. కేజీఎఫ్‌తో దుమ్ము రేపిన ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు... స్టార్లతో ఈ సినిమా కళకళలాడబోతోందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఓ కీలకమైన పాత్రకు చిరంజీవిని ఎంచుకోవాలని భావిస్తున్నారని, మెగాస్టార్, రెబల్ స్టార్ ఇద్దరూ ఒకే తెరపై కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈ టీమ్ తో చేతులు కలుపుతున్నాడని తెలుస్తోంది.
`సలార్`లో ప్రధాన ప్రతినాయకుడు ఎవరన్నది ఇంత వరకూ తేలలేదు. ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంని ఎంచుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అవి ఎంత వరకూ నిజమో తెలియాలంటే... చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. 2021లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. అయితే కరోనా కారణంతో షూటింగ్ మాటిమాటికీ వాయిదా పడుతోంది. 2022 వేసవిలో ఈసినిమా ని వెండి తెరపై చూసే అవకాశం ఉంది.