పాన్ ఇండియా స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. ఇది జానీకి ఊహించని షాక్. ఇప్పటికే తన అసిస్టెంట్ లేడి కొరియో గ్రాఫర్ ని లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయ్యి, జ్యుడిషయల్ కస్టడీలో కొన్ని రోజలున్నారు. రీసెంట్ గా కండీషనల్ బెయిల్ పై రిలీజ్ అయ్యారు జానీ. జైల్లో ఉండగానే తిరు సినిమాకి వచ్చిన నేషనల్ అవార్డు కూడా మిస్ అయ్యారు. పలువురు జానీకి నేషనల్ అవార్డు ఇవ్వటం పట్ల నిరసన తెలపటంతో కేంద్రం నేషనల్ అవార్డు రద్దు చేసింది. ఇప్పడు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా డాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీని శాశ్వతంగా తప్పించి ఎన్నికలు జరుపుతున్నారు.
జానీ మాస్టర్ ఇన్నాళ్లు డాన్సర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉండేవారు. అయితే లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో జానీని తప్పించి ఆదివారం ఎన్నికలు జరిపారు. కనీసం జానీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటం గమనార్హం. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జోసెఫ్ డాన్సర్స్ అసోషియేషన్ కి ఎన్నిక కావటం ఇది ఐదో సారి. ఇంత జరుగుతున్నా తనను ఏ అసోసియేషన్ తొలగించలేదని జానీ మాస్టర్ చెప్తున్నారు.
అసోసియేషన్ కోసం తన హయాంలో శంకర్ పల్లిలో 9 ఎకరాలు భూమి కొనుగోలు చేశారని, అప్పుడు కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని, స్కామ్ మొత్తం బయట పెట్టినందుకు తనని అవాయిడ్ చేసారని జానీ అంటున్నారు. అంతే కాదు డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల ఇష్యులో కూడా మనీ వసూల్ చేసారని, ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు.