జు. ఎన్టీఆర్- తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఉన్న గొప్ప నటుల్లో ఆయన ఒకరు.
వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి కాని మార్చ్ లో కాని మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తనవంతుగా సిద్ధం అవుతున్నాడట. అది ఎలా అంటే ఆ చిత్రంలోని పాత్ర కోసం రోజు సుమారు 12 గంటల పాటు జిమ్ లో గడుపుతున్నాడట.
రోజుకి 12గంటలు తన శరీరాకృతి కోసం కష్టపడుతున్నాడు అంటే ఆ పాత్ర ఎటువంటిదో, ఎలా ఉంటుందో అని అర్ధం చేసుకోవచ్చు. అయితే సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపిస్తాడు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ వార్త దానికి బలం చేకూర్చేలానే కనిపిస్తున్నది.
మొత్తానికి ఎన్టీఆర్ కొత్త లుక్ తో దర్శనమివ్వనున్నాడు అని మాత్రం కచ్చితంగా చెప్పగలం. ఇక త్రివిక్రమ్ దర్శకత్వ శైలి తెలిసిన ప్రేక్షకులకి అందులో ఎన్టీఆర్ ఎలా ఒదిగిపోగలడు అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.