ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న 'జై లవకుశ' సినిమా విడుదలకి సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రొమోషన్ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జోరుగా పాల్గొంటున్నారు. ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియా ముఖంగా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అలా చెప్పిన ఎన్టీఆర్ మనసులోని మాట.. 'అదుర్స్' సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. కానీ అందులోని చారి అత్యద్భుతమైన పాత్ర. మళ్ళీ చేయాలంటే ఆ పాత్ర మరింత బాగా జనంలోకి వెళ్ళగలగాలి. ఏమాత్రం ఎనర్జీ తగ్గినా, చారి పాత్ర మీద జనానికి ఉన్న ఇష్టం చచ్చిపోతుంది. అందుకే భయం.. అని ఎన్టీఆర్ అన్నారు. అయితే వినాయక్ దర్శకత్వంలోనే 'అదుర్స్' సీక్వెల్ ఎన్టీయార్ చేస్తాడనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతున్న మాట వాస్తవమే. ఈ తరుణంలో అలాంటి పాత్రని మళ్ళీ చేయలేనని ఎన్టీయార్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే చేయాలన్న కోరిక మాత్రం అలాగే ఉందట ఎన్టీఆర్‌కి. అయితే అందుకు ఇప్పుడు సమయం కాదని మాత్రమే ఆయన ఉద్దేశ్యం. కాకపోతే, ఇంకొన్నాళ్ళ తర్వాత అయినా ఎన్టీయార్ ధైర్యం తెచ్చుకుని ఆ పాత్ర చేస్తాడేమో చూడాలిక. ఇకపోతే 'జై లవకుశ'లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం గురించి అభిమానుల్లో ఉన్న భారీ అంచనాల్ని డైరెక్టర్ బాబీ ఎంత మేర నెరవేర్చాడో అనే ఆశక్తి అంతటా నెలకొంది. సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ గురువారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.