ఈ రోజుల్లో హీరోలు తమ తోటి హీరోలను పలు విషయాల్లో అభినందించుకుంటున్నారు. చాలా ఫ్రెండ్లీగా మెలగుతున్నారు. తమలోని లోపాలను, ఎత్తి చూపుకుంటూనే, ప్లస్ పాయింట్స్‌కి ప్రశంసించుకుంటున్నారు కూడా. అలాగే ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్‌ని ప్రశంసలతో ముంచెత్తేశారు. ఎందుకంటారా? అల్లు అర్జున్ డాన్స్ అంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్టమట. ఎన్టీఆర్ మంచి డాన్సర్. అంత మంచి డాన్సర్ మరో డాన్సర్‌ని మెచ్చుకోవడమంటే చిన్న విషయం కాదు. అదే ఎన్టీఆర్ పెద్ద మనసుకు తార్కాణం. అల్లు అర్జున్ డాన్సులోని స్టైల్ అంటే ఎన్టీఆర్‌కి ఇష్టమని ఎన్టీఆర్ అంటున్నాడు. నిజానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, యంగ్ హీరో రామ్ ఇలా చాలా మందే మంచి డాన్సర్స్ ఉన్నారు ఈ జనరేషన్‌లో ఆ కోవలో ముందుగా వినిపించే పేరు రామ్ చరణ్ అయినా కానీ ఎన్టీఆర్ మెచ్చిన డాన్సర్ అయితే అల్లు అర్జున్ అట. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బన్నీ గురించి చెప్పిన మాట ఇది. అలాగే ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలంతా డాన్సులు, యాక్టింగ్‌లో ముందుగానే శిక్షణ తీసుకుని వస్తున్నారు. తద్వారా స్క్రీన్‌పై మంచి టాలెంట్ ప్రదర్శిస్తున్నారు అది వేరే సంగతి. ఇకపోతే త్వరలోనే ఎన్టీఆర్ 'జై లవకుశ' సినిమాతో మన ముందుకు వస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్ ఎన్టీఆర్‌తో జత కడుతున్నారు ఈ సినిమాలో. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నిర్మాత కళ్యాణ్‌రామ్.