నేను ప్రాక్టికల్ గా ఉంటా: ఎన్టీఆర్

By iQlikMovies - October 07, 2018 - 15:47 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత విడుదలకి కేవలం ఇంకా మూడు రోజులే మిగిలున్నాయి. ఈ సందర్భంగా అరవింద సమేతకి సంబందించిన ప్రచార కార్యక్రమాలని మొదలుపెట్టాడు.

అయితే ఈ చిత్రం ఆయనకి చాలా ప్రత్యేకమైనది. దీనికి ప్రధాన కారణం- ఈ చిత్రం చేస్తున్న సమయంలోనే తన తండ్రిని కోల్పోవడం, కాకతాళీయంగా ఈ చిత్రంలో కూడా ఆయన తండ్రి పాత్ర మరణించే సన్నివేశాలు ఉండడం, ఇది ఒక భావోద్వేగాలతో నిండిన కథ కావడంతో ఆయన నిజజీవితంలో ప్రస్తుతం ఉన్న మానసిక స్థితికి సినిమాలో ఉన్న పాత్రకి పెద్దగా తేడాలేదు.

ఇదే విషయాన్ని ప్రెస్ వారు అడగగా- ఇది యాదృచ్ఛికమో లేదో తెలియదు కాని ఇప్పుడు నా మనసులో ఉన్న ఈ విషాదాన్ని తీసేసే పనిలో ఉన్నాను. అయతే ఈ సంఘటనలతో నేను ప్రాక్టికల్ గా మారిపోయా.. మనమందరం నిమిత్తమాత్రులం, జరిగేది జరగక మానదు.. ఇది కాస్త వేదాంతంలా ఉన్నా ఇలా అనుకుంటేనే జీవితంలో ముందుకి వెళ్ళగలం అని నేను నమ్ముతున్నాను... అదే పాటిస్తాను. 

అయితే ఈ సినిమా మాత్రం ఒక మంచి ప్రయాణం అని చెబుతూ ముగించాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS