అనిల్ రావిపూడి.. ఈ జనరేషన్‌లో క్రేజీ దర్శకుడు. ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాపు లేదు. అన్నీ హిట్లే. చక చక సినిమా తీసేస్తాడన్న పేరుంది. త్వరలోనే... బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ సిద్ధమైంది. బాలయ్య కాల్షీట్లు దొరకడమే ఆలస్యం. ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కూడా సినిమా చేసే ఛాన్స్ అనిల్ రావిపూడికి దక్కిందని టాలీవుడ్ టాక్.
ఆర్.ఆర్.ఆర్ తరవాత.. ఎన్టీఆర్ కాస్త రిలాక్స్ అవుదామనుకుంటున్నాడు. టెన్షన్లేమీ లేకుండా సరదా సరదాగా సాగిపోయే సినిమాలు చేద్దామనుకుంటున్నాడు. ఇలాంటి సినిమాలు చేయడంలో దిట్ట... అనిల్ రావిపూడి. అందుకే ఈ కాంబో ఈజీగా సెట్టయిపోయింది. ఇటీవల దిల్ రాజు.. ఎన్టీఆర్‌ని కలిశాడట. `అనిల్ దగ్గర ఓ కథ ఉంది.. విను` అని చెప్పేసరికి.. ఎన్టీఆర్ అనిల్ ని పిలిపించడం, కథ వినడం జరిగిపోయాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీ. అనిల్ రావిపూడికి సైతం.. బాలయ్య సినిమా ఫినిష్ అవ్వాలి. ఆ తరవాతే.. ఈ కాంబో ఉండొచ్చు,