విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కలయికలో 'జనగణమన' సినిమా కి క్లాప్ పడింది. లైగర్ లానే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందనుంది. విషయం ఏమిటంటే.. ఈ చిత్రానికి నిర్మాతగా ఓ దర్శకుడు పూరితో కలసిరావడం. పూరి, ఛార్మీతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా నిర్మాణంలో బాగస్వామి అవుతున్నారు. నిజానికి వంశీ ఇంతకుముందు నిర్మాణం చేసింది లేదు. ఇప్పుడాయన శ్రీకర స్టూడియో బ్యానర్ అనే నిర్మాణ సంస్థని రిజిస్టర్ చేసి తొలి సినిమాగా'జనగణమన నిర్మాణంలో బాగస్వామయ్యారు. ఇది కాస్త ఆసక్తికరమైన అంశమే.
జనగణమన నేపధ్యంలోకి వెళితే పదేళ్ళ క్రితం నుంచి ఈ టైటిల్ తో సినిమా చేస్తానని దర్శకుడు పూరి జగన్నాధ్ చెబుతూ వచ్చారు. మహేష్ బాబు హీరోగా అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఏం జరిగిందో ఈ ప్రాజెక్ట్ నుంచి మహేష్ బాబు పక్కకు జరిగారు. విజయ్ తో లైగర్ తెరకెక్కించారు పూరి. విజయ్ ఈ కథకు సరిపోతాడనే నమ్మకం ఆయనకి కుదిరింది. విజయ్ కూడా జనగణమన కి జెండా ఊపేశాడు. అయితే ఇక్కడ మహేష్, వంశీకి మధ్య మంచి స్నేహం వుంది. ఈ కథ మహేష్ కి చెప్పినపుడే వంశీకి స్టొరీ లైన్ తెలుసని టాక్. వంశీకి నిర్మాతగా మారి మంచి కంటెంట్ వున్న సినిమాలు తీయాలని ఎప్పటినుంచో వుంది. నిర్మాతగా జర్నీ జనగణమనతోనే మొదలుపట్టాలని భావించిన వంశీ ఈ ప్రాజెక్ట్ లోకి రావడం జరిగిందట. నిజానికి ఇది చాలా మంచి పరిమాణం. ఒక దర్శకుడు మరో దర్శకుడి సినిమాని ప్రోడ్యుస్ చేయడం అంటే కంటెంట్ పై ప్రారంభంలోనే పాజిటివ్ వైబ్రేషన్ కలిగించినట్లవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.