బిగ్ బాస్ ఇంటిలో ప్రవేసించే సమయానికి జనాలకి అంత పెద్దగా పరిచయం లేని వ్యక్తి భాను శ్రీ. అయితే బిగ్ బాస్ ఇంటిలో తన ప్రవర్తన, భోళాతనంతో అందరిలోనూ గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తాజాగా ఆమె ఇంటినుండి బయటకి వచ్చాక ఇంటర్వ్యూలోతో ఫుల్ బిజీ బిజీ గా గడుపుతున్నది. ఈ తరుణంలో ఆమె తనకి కాబోయే జీవిత భాగస్వామి గురించిన వివరాలని మీడియాతో పంచుకుంది. ఇంతకి ఆమె మనసు గెలుచుకున్న ఆ వ్యక్తి పేరు శివశంకర్ రెడ్డి.
భాను తొలుత ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన సమయంలో ఒక డ్యాన్సర్ గా తన జీవితం ప్రారంభించిన సమయంలోనే శివశంకర్ తో పరిచయం అవ్వడం తనకి అన్ని విషయాలలో సలహాలు ఇస్తూ ఒక మంచి ఫ్రెండ్ లా మారిపోయాడట.
అతని మనస్తత్వం బాగా నచ్చి భాను శ్రీ నే శంకర్ తో తన మనసులో మాట చెప్పిందట. ఇక వీరి ప్రేమని భవిష్యత్తులో పెళ్ళిగా మలుచుకుని జీవితంలో ఒకటవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిపింది.
ఈ సందర్భంగా ఈ ఇద్దరికి మా తరపు నుండి బెస్ట్ విషెస్...