యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా సినిమాకీ ఎన్టీఆర్ దాదాపుగా లుక్స్ ఛేంజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు.
మొదట్లో ముద్దుగా, బొద్దుగా ఉండే ఎన్టీఆర్, ఆ తర్వాత స్లిమ్‌గా మారిపోయాడు కొన్నాళ్లు. ఇటీవల 'నాన్నకు ప్రేమతో' సినిమాలో హెయిర్ స్టైల్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకూ అంతా ఛేంజ్ చేసేశాడు. ఆ తర్వాత 'జనతా గ్యారేజ్' సినిమాకి ఎన్టీఆర్ కొంచెం బొద్దుగా మారి కొంచెం పాత లుక్‌లో ఎన్టీఆర్‌లా కనిపించాడు. 'జై లవకుశ' కోసం మూడు డిఫరెంట్ గెటప్స్‌లో ఎన్టీఆర్ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందోనంటూ ఆశక్తి నెలకొంది ఎన్టీఆర్ అభిమానుల్లో. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ లుక్‌లో అయితే ఎన్టీఆర్ కనిపించబోతున్నాడంటూ ప్రచారం బాగా జరుగుతోన్న మాట వాస్తవమే.
అందులో భాగంగానే 'జనతా గ్యారేజ్', 'జై లవకుశ' సినిమాల తర్వాత ఎన్టీఆర్ బాగా బరువు పెరిగిన మాట కూడా వాస్తవమే. కొత్త సినిమాలో హీరో రోల్ కోసం కాస్త సన్నబడాలని త్రివిక్రమ్, ఎన్టీఆర్‌కి సూచించాడట. దాంతో ఎన్టీఆర్ ఎక్కువ టైం జిమ్‌లోనే గడుపుతున్నాడట. అందుకు నిదర్శనంగా, ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్‌కి ఫిట్‌నెస్‌లో ట్రైనింగ్ ఇస్తోన్న లాయిడ్ స్టీవెన్స్ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఈ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూసిన అభిమానులు అబ్బో.! ఎన్టీఆర్ భలే ముద్దొచ్చేస్తున్నాడే అనుకుంటున్నారు.
నిజంగానే ఎన్టీఆర్ ఫ్రెష్ లుక్స్‌తో అలరిస్తున్నాడు ఈ వీడియోలో. అయితే ఇది చాలదట. ఎన్టీఆర్ ఇంకా బరువు తగ్గాలట. అదీ సంగతి. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది.