ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బుల్లితెర రియాల్టీ షో 'బిగ్‌బాస్' గత వారం రోజులుగా బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సంగతి తెలిసిందే. 14 మంది సెలబ్రిటీస్‌తో, 60 కెమెరాల మధ్య నడుస్తోన్న ఈ షోను ఎన్టీఆర్ మొదటి రోజు స్టార్ట్ చేసి, పార్టిసిపెంట్స్‌ని పరిచయం చేశారు. ఆ తరువాత ఆరు రోజులు ఎన్టీఆర్ షోలో కనిపించలేదు. కేవలం ఈ 14 మంది సెలబ్రిటీస్ మాత్రమే షోలో పర్‌ఫామ్ చేశారు. ఈ ఆరు రోజులు ఆడియన్స్ నుండి అంత పోజిటివ్ రెస్పాన్స్ ఏమీ వచ్చినట్లు లేదు. కానీ శనివారం, ఆదివారంలో మళ్లీ ఎన్టీఆర్ అప్పియరెన్స్‌తో షోకి ఎనర్జీ పుంజుకుంది. ఈ రెండు రోజుల్లోనూ ఎన్టీఆర్ తనదైన శైలిలో 'బిగ్‌బాస్'కి ఎనర్జీతో పాటు గ్లామర్‌ని తీసుకొచ్చాడు. ఇన్ని రోజులూ, 14 మంది సెలబ్రిటీస్‌తో చప్పగా సాగిన షో కాస్త ఈ రెండు రోజుల్లో మితిమీరిన ఎనర్జీతో సాగింది. దాంతో 'బిగ్‌బాస్' షోకి మళ్లీ జోరు పెరిగింది. ఈ ఆరు రోజుల్లోనూ ఇంత మంది సెలబ్రిటీస్ రక్తి కట్టించలేకపోయారు. కానీ వీకెండ్స్‌లో ఎన్టీఆర్ అప్పియరెన్స్‌కి మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఇకపై జరిగే ఈ వారం రోజుల్లో సెలబ్రిటీస్ బిగ్ హౌస్‌లో ఎలా ఉండాలి, ఎలా మేకప్ వేసుకోవాలి, హౌస్ రూల్స్‌ని ఎలా ఫాలో చేయాలి అని గుర్తు చేశారు. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్‌తో ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' షో మొత్తానికి సరదా సరదాగా సాగింది. ఎన్టీఆర్ చెప్పిన మార్పులతో ఇకపై నడిచే వారం రోజులు 'బిగ్‌బాస్' షో ఎలా రక్తి కడుతుందో చూడాలిక.