డ్రగ్స్ కేసులో విచారణ సందర్భంగా రోజుకొక టాలీవుడ్ ప్రముఖులని SIT విచారణ జరుపుతున్నది.
అందులో భాగంగా ఈరోజు, హీరో నవదీప్ సిట్ ముందు హాజరయ్యాడు. కొద్దిసేపటి క్రితమే ఆయనకి సంబంధించిన విచారణ మొదలయింది, మరి నవదీప్ ని ఎన్ని గంటలు ప్రశ్నిస్తారో అన్న విషయమై ఇప్పుడు సర్వత్రా ఉత్కంట నెలకొంది.
ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాధ్, కెమెరామెన్ శ్యాం కె నాయుడు, నటులు సుబ్బరాజు, హీరో తరుణ్ విచారణ ముగిసింది. ఇక రేపు రవి తేజ విచారణకి హాజరవుతారు అన్న గుసగుసలు వినిపిస్తున్న నేపధ్యంలో ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ అయితే అందరిలో ఉంది.
అయితే రేపు ఎవరు విచారణకి హాజరవుతారు అన్న విషయం ఇంకా అధికారికంగా తెలియరాలేదు.