భూ వివాదంలో చిక్కుకున్న తారక్

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ కి ఒక ఆపద వచ్చి పడింది. అప్పుడెప్పుడో కొనుక్కున్న ప్రాపర్టీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుని, ఆ ల్యాండ్ లో కట్టుకున్న ఇల్లు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. అసలేం జరిగింది అంటే 2003లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ఓ ప్లాట్ ను ఎన్టీఆర్, గీతా లక్ష్మీ అనే ఆమె దగ్గర కొనుక్కున్నారు. అదే ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆ స్థలం అమ్మిన గీతా లక్ష్మి కుటుంభం 1996 లోనే ఇదే ల్యాండ్ ని పలు బ్యాంకుల్లో పెట్టి, ప్రాపర్టీ మార్ట్ గేజ్ ద్వారా లోన్స్ తీసుకున్నారు. ఆ విషయం చెప్పకుండా వారు ల్యాండ్ ని ఎన్టీఆర్ కి అమ్మేశారు.  


కేవలం ఒక్క బ్యాంకులోనే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పటంతో చెన్నైలో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకున్నారు తారక్. తరవాత నుంచి బ్యాంకు మేనేజర్లతో ఈ ప్లాట్ విషయంలో వివాదం మొదలయ్యింది. బ్యాంక్ మేనేజర్లతో విసిగిపోయిన ఎన్టీఆర్ 2019లో బ్యాంక్ నోటీసుల పై సవాల్ చేస్తూ డీఆర్టీలో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ తీర్పు తారక్ కి వ్యతిరేకంగా వచ్చింది. డీఆర్టీ ఈ స్థలంపై బ్యాంక్ లకే హక్కు ఉంటుందని తేల్చింది. దీంతో ఎన్టీఆర్ తనకు ల్యాండ్ అమ్మిన గీతాలక్ష్మి పై కేసు ఫైల్ చేశారు. అంతేకాకుండా డీఆర్టీ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. 


ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం, డీఆర్టీ కాపీని తారక్ లాయర్ల సమర్పించకపోవటంతో జూన్ 6 కి విచారణ వాయిదా వేశారు. దీనికి సంభందించిన అన్ని వివరాలు జూన్ 3లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫాన్స్ కోర్టు తీర్పు తమ హీరోకి అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS