తాత సినిమా కోసం మనవడు వస్తాడా?

మరిన్ని వార్తలు

తేజ డైరెక్టర్‌గా ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్‌ హల్‌ చల్‌ చేస్తోంది. డైరెక్టర్‌ తేజ, జూనియర్‌ ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారమ్‌. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో జూనియర్‌ని నటించమనీ తేజ అడుగుతున్నారనీ టాక్‌ వినిపిస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తే సినిమాకి మరింత వెయిట్‌ పెరుగుతుందని తేజ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించినా నందమూరి అభిమానులు పండగ చేసుకుంటారు. అలాగే నందమూరి ఫ్యామిలీని ఒకేచోట చూపించిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించాలనే తపనతో తేజ ఉన్నాడట. అయితే ఎన్టీఆర్‌ పాత్రలోనే జూనియర్‌ నటిస్తాడా? అంటే అందుకు ఆయన నో అనేశారు. అంతటి సాహసం తాను చేయలేనని తేల్చి చెప్పేశారు. ఎందుకంటే ఆయన స్థాయి వేరనీ, ఆ పాత్రలో నేను నటించి, ఆ పాత్ర స్థాయిని తగ్గించలేననీ చెప్పేశాడు ఎన్టీఆర్‌. తాతకు తగ్గ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నటనలో. అయితే ఆయన పాత్ర కోసం ఆల్రెడీ బాలయ్య రెడీగా ఉన్నారు. అయినా ఆ పాత్రకి బాలయ్యని మించిన నటుడెవరు? అయితే ప్రతిష్ఠాత్మక చిత్రం కాబట్టి, ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తే బావుంటుందనీ తేజ భావిస్తున్నాడట. కాగా సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రం వివాదాలకు దూరంగా ఉంటుందని తేజ అంటున్నారు. ఎన్టీఆర్‌ గొప్ప మహానుభావుడు. ఆయన చరిత్రలో సినీ, రాజకీయ ప్రస్థానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆ అంశాల్నే ఎక్కువగా ఈ చిత్రంలో హైలైట్‌ చేయనున్నామనీ, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రంగా ఈ సినిమా ఉండబోతోందని డైరెక్టర్‌ తేజ చెప్పారు. ఈ సినిమాకి బాలయ్యే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS