ఓ వైపు పిల్లనిచ్చిన మామ. ఇంకోవైపు తన పెళ్లికి పెద్దగా వ్యవహరించిన మరో మామ. ఇప్పుడీ ఇద్దరి మామల నడుమ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఇరుక్కుపోయాడు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ని ఫుల్‌గా వాడేసిన సంగతి తెలిసిందే.
హరికృష్ణకు చంద్రబాబు బావ కనుక ఎన్టీఆర్‌కి చంద్రబాబు మామయ్యే. ఇంకోపక్క ఎన్టీఆర్‌కి సొంత మామగారైన నార్నే శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీలో చేరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు కూడా. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎటువైపు మొగ్గు చూపుతాడు.? ఎన్టీఆర్ అభిమానుల పరిస్థితేంటీ.? అనే చర్చ అంతటా జరుగుతోంది.
అయితే రాజకీయాలు వేరు, కటుంబ సంబంధాలు వేరు. సినిమాలు వేరు. 2009లో టీడీపీ తరపున ప్రచారం చేసినా, ఎన్టీఆర్ 2014లో మాత్రం రాజకీయాల జోలికి వెళ్లలేదు. సో త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ తటస్థంగా ఉండొచ్చు. కానీ జూ. ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఇటు చంద్రబాబు, అటు నార్నే శ్రీనివాసరావు ఫుల్‌గా వాడేసుకునే అవకాశాలు లేకపోలేదు.