మహేష్ బాబు పేరు కూడా అంతే. అదో బ్రాండ్ లా మారిపోయింది. ఆ బ్రాండే ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. దానికి ఉదాహరణ.. `మేజర్` సినిమానే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అడవిశేష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్‌తో మహేష్ భాగస్వామిగా మారాడు.
ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలను మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ చూసుకోబోతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ సినిమాకి మహేష్ స్లీపింగ్ పార్టనర్ మాత్రమే. తన నుంచి ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టడం లేదు. మహేష్ బాబు ప్రొడక్షన్ అనే బ్రాండు మాత్రమే సోనీ పిక్చర్స్ వాడుకుంటోంది. అందుకు ప్రతిఫలంగా `మేజర్` సినిమాలోని లాభాల్ని మహేష్ కి అందిస్తోంది.
తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైనా, కేవలం తెలుగుకి సంబంధించిన లాభాల్లోనే మహేష్ వాటాదారుడు అన్నమాట. మహేష్ బ్రాండింగ్, తన ప్రచారం ఈ సినిమాకి బాగా కలిసొస్తుందని సోనీ పిక్చర్స్ భావిస్తోంది. ఏ విధంగా చూసినా మహేష్‌కి ఇది లాభదాయకమైన వ్యాపారమే. పైసా పెట్టుబడి లేకుండా... కోట్లు సంపాదించే అవకాశం వచ్చింది. మహేష్ తెలివైన బిజినెస్ మేనే.