ఎన్టీఆర్ జైలవకుశ ఇంకొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
ఇక ఎప్పటిలాగే ఈ చిత్రానికి సంబందించిన బెనిఫిట్ షోల గురించి ఫ్యాన్స్ ఆరాతీయడం మొదలయింది. కాని అందుతున్న సమాచారం ప్రకారం, జైలవకుశ బెనిఫిట్ షోలకి పోలీస్ అధికారుల నుండి అనుమతి లభించలేదట.
అయితే గత కొంత కాలంగా విడుదలవుతున్న చిత్రాలకి హైదరాబాద్ లో బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వడం మానేశారు. దీనితో రేపు ఉదయం 6గంటల తరువాత షోలు మొదలయ్యే అవకాశం ఉంది అని సమాచారం తెలుస్తున్నది.
ఇక సినిమా రిపోర్ట్ కోసం రేపు ఉదయం వరకు ఆగాల్సిందే.